News February 1, 2025
MDK: యువతితో అసభ్య ప్రవర్తన.. మూడేళ్ల జైలు శిక్ష: ఎస్పీ

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన చంద్రలింగం అదే గ్రామానికి చెందిన అమ్మాయిని చేతి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిపై కేసు నమోదైనట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అతనికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.21 వేల జరిమానా విధించినట్లు చెప్పారు. కేసు పూర్తిగా విచారణ చేసి మెదక్ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీ శారద తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News February 10, 2025
MDK: రేపు ముసాయిదా జాబితా విడుదల

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. MDK జిల్లాలో 21 ZPTCలు, 190 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు.
News February 10, 2025
మెదక్: విద్యుత్ షాక్‌తో ఐదేళ్ల బాలుడు మృతి

విద్యుత్ ఘాతానికి చిన్నారి బలైన ఘటన పాపన్నపేటలో జరిగింది. మండల పరిధిలోని నర్సింగరావుపల్లి తండాకు చెందిన లక్ష్మణ్‌కు అనిరుథ్ (5), శ్రీనాథ్ ఇద్దరు కుమారులు. ఆదివారం సాయంత్రం బావమరిది గణేశ్ నిశ్చితార్థం ఉండడంతో కుటుంబంతో కలిసి ధంజ్యాతండాకు వచ్చారు. ఈ క్రమంలో డీజే సౌండ్ కోసం అమరుస్తున్న తీగలపై కాలు పెట్టి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
News February 9, 2025
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే చెప్పండి: మెదక్ పోలీసులు

పై ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని మెదక్ జిల్లా పోలీసులు సూచించారు. మెదక్ మండల కేంద్రంలోని ఒకటో నంబర్ కల్లు దుకాణంలో మహిళను మభ్యపెట్టి ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకుని పరారైన దుండగుడి ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తిస్తే సంబంధిత పోలీస్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు.