News April 12, 2025
MDK: రాజీవ్ యువ వికాసం.. ఈనెల 14 వరకే ఛాన్స్

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. శుక్రవారం వరకు మెదక్ జిల్లాలో 16వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 14 వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.
Similar News
News April 16, 2025
కాంగ్రెస్ పాలనలో ప్రజల బతుకులు ఎడారి: హరీశ్ రావు

వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల భూగర్భజలాలు తగ్గడం, నీటి ఎద్దడి పెరగడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సాగు నీళ్ల కోసం రైతుల గోస పడితే.. ఇప్పుడు తాగు నీళ్ల కోసం ప్రజల ఘోష పడాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పొలాలు తడారిపోతున్నాయని.. ప్రజల బతుకులు ఎడారి అయిపోతున్నాయని ఆవేదన చెందారు.
News April 16, 2025
మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా బదిలీ

మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా బదిలీ అయ్యారు. మెదక్ జిల్లాకు కొత్త న్యాయమూర్తిగా జగిత్యాల జిల్లా నుంచి నీలిమ రానున్నారు. ఇక్కడి నుంచి లక్ష్మి శారదా సూర్యాపేటకు బదిలీ అయ్యారు. లక్ష్మి శారదా ఇక్కడ 2022 జూన్ 2 నుంచి పనిచేస్తున్నారు. లక్ష్మి శారదా హయాంలో 2వ అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన, కొత్త కోర్టులు మంజూరు చేయించారు.
News April 16, 2025
రామాయంపేటలో వడదెబ్బతో వృద్ధుడి మృతి

వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన రామాయంపేటలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రామాయంపేట పట్టణానికి చెందిన ఎరుకల బాలయ్య(82) కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం కూడా పనికి వెళ్లారు. తిరిగి వచ్చిన ఆయన నీరసంగా ఉందని ఇంట్లోనే ఉన్నాడు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.