News March 25, 2025
MDK: రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకం: హరీశ్‌రావు

సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలులో ఆదివారం యువతిపై జరిగిన అత్యాచారయత్నం ఘటన తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానిలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు. ఆ కీచకుడి నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం రైలు నుంచి దూకి తీవ్రంగా గాయపడి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు.
Similar News
News November 10, 2025
గురుకుల విద్యార్థులకు “నీట్” పరీక్షకు ఉచిత శిక్షణ

ఏలూరు జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకుని నీట్ కు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయ అధికారి ఉమ కుమారి సోమవారం ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 10, 2025
వ్యక్తిగత ప్రదర్శన ముఖ్యం కాదు: గంభీర్

హెడ్ కోచ్‌గా తనకు జట్టు ప్రదర్శనే ముఖ్యమని గంభీర్ తెలిపారు. ‘క్రికెట్ వ్యక్తిగత ప్రదర్శనకు సంబంధించింది కాదని నమ్ముతాను. మేము ODI సిరీస్ ఓడిపోయాం. కోచ్‌గా ఇండివిడ్యువల్ గేమ్‌ను మెచ్చుకోవచ్చు. ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా సిరీస్ ఓటమిని సెలబ్రేట్ చేసుకోలేను. T20 సిరీస్ వేరే.. అందులో గెలిచాం. దానిలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. కానీ WCకి ముందు మేమనుకున్న చోట లేము’ అని తెలిపారు.
News November 10, 2025
కామారెడ్డి: జాతీయ రహదారుల భూసేకరణపై కలెక్టర్ సమీక్ష

జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులు, నష్టపరిహారం చెల్లింపులపై KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. NH–765D ప్రాజెక్టు కింద మెదక్ నుంచి ఎల్లారెడ్డి (ప్యాకేజ్-1) వరకు అవార్డులు పూర్తయ్యాయని తెలిపారు. ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ (ప్యాకేజ్-2) భూసేకరణను పూర్తి చేసి, రైతులకు నష్టపరిహారం త్వరగా అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


