News March 25, 2025

MDK: రాష్ట్రంలో మహిళ‌ల భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థ‌కం: హ‌రీశ్‌‌రావు

image

సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలులో ఆదివారం యువతిపై జరిగిన అత్యాచారయత్నం ఘటన తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానిలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నట్లు? అని ప్ర‌శ్నించారు. ఆ కీచకుడి నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం రైలు నుంచి దూకి తీవ్రంగా గాయపడి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు.

Similar News

News April 19, 2025

టైట్ డ్రెస్‌లు వేసుకుంటే..

image

టైట్‌గా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల నడుము, కాళ్ల వద్ద రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. కాబట్టి వాపు రావడం, రక్తం గడ్డకట్టడం లాంటివి జరుగుతాయి. పలు రకాలైన చర్మ సమస్యలతో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. బిగుతైన దుస్తులు ధరించడం వల్ల ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. నరాల సమస్యతో పాటు గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News April 19, 2025

సిద్దిపేట: ‘పంట సాగు, సన్న బియ్యం, తాగునీటిపై సమీక్ష ‘

image

గతంతో పోల్చుకుంటే తెలంగాణలో పంట దిగుబడి రికార్డు స్థాయిలో జరిగిందని రాష్ట్ర ఇరిగేషన్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్గాటించారు. శనివారం హైదరాబాద్ నుంచి మంత్రి దనసరి అనసూయ సీతక్క, పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్‌తో కలిసి రభీ 2024-25 పంట సాగు, సన్న బియ్యం పంపిణీ, తాగునీటిపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. కలెక్టర్ మనూచౌదరి పాల్గొన్నారు.

News April 19, 2025

కలిదిండి: ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్

image

కలిదిండి మండలంలో వరుసగా జరుగుతున్న మోటార్ సైకిళ్ల దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. శనివారం ఇద్దరిని అరెస్టు చేసి సుమారు రూ.3,50,000 విలువ చేసే 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కలిదిండి ఎస్ఐ వెంకటేశ్వరరావు, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, పీసీలు రమేశ్ పొట్టి కాసులు, శ్రీనులను CI రవికుమార్ అభినందించారు.

error: Content is protected !!