News May 5, 2024
MDK: రికార్డ్.. 44.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత

మెతుకు సీమ భగ భగమంటోంది. రోజురోజుకు భానుడు తాపానికి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో జనం జలు హడలిపోతున్నారు. రేగోడ్‌లో శనివారం రికార్డు స్థాయిలో 45.1 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 4 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 రోజులుగా ఎండ పెరుగుతూ వచ్చింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిన్న వడదెబ్బతో ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News November 28, 2025
రేపు మెదక్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడలు

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి మెదక్‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి వి.హేమ భార్గవి తెలిపారు. పరుగు పందెం, షాట్ పుట్, చెస్, కార్రమ్స్, జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, మహిళా సంఘ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, సమస్త దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.
News November 28, 2025
ఫూలే వర్ధంతి: మంత్రి పొన్నం నివాళి

మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ కోసం ఫూలే చేసిన సేవలను స్మరించుకుంటూ నాయకులు, అధికారులు పుష్పాంజలి ఘటించారు. ఆయన చూపిన మార్గంలో నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.
News November 28, 2025
మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.


