News August 21, 2024
MDK: రుణమాఫీపై రైతుల్లో గందరగోళం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన రుణమాఫీ ప్రక్రియలో రైతుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా రైతులు గందరగోళానికి గురయ్యారు. రుణమాఫీలో ఆధార్, రేషన్ కార్డులను ప్రభుత్వం జోడించడంతో అర్హత ఉన్న అవ్వడం లేదని వాపోతున్నారు. రూ.2 లక్షల పై వారు ఉన్న మిత్తి డబ్బులు ఎప్పుడు చెల్లించాలో తెలియడం లేదు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
Similar News
News September 20, 2024
మెదక్ జిల్లాలో సమిష్టి కృషితో నిమజ్జన ప్రక్రియ పూర్తి: ఎస్పీ
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. విద్యుత్, మున్సిపల్, రెవిన్యూ శాఖలను సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. గడిచిన 12 రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది కృషి వల్ల గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ముగిసాయన్నారు.
News September 19, 2024
సంగారెడ్డి: క్రీడా పాలసీకి దరఖాస్తుల ఆహ్వానం
క్రీడా పాలసీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడా అధికారి ఖాసిం బేగ్ తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండి ఆదేశాల మేరకు క్రీడా పాలసీ రూపొందించిందని పేర్కొన్నారు. 2019 నుంచి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులు తమ వివరాలను కలెక్టరేట్లోని జిల్లా యువజన,క్రీడా కార్యాలయంలో ఈనెల 24వ తేదీలోగా సమర్పించాలని తెలిపారు.
News September 19, 2024
MDK: వచ్చే నెల 3 నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో వచ్చే నెల 3 నుంచి 9 వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. అక్టోబరు 16 నుంచి 23 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఆయా విద్యాసంస్థల్లో సంప్రదించాలని ఆయన కోరారు.