News July 22, 2024

MDK: రైతుబీమా దరఖాస్తులకు ఆగస్టు 5 చివరి తేదీ

image

రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆగస్టు 5 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోని 18 నుంచి 59 ఏండ్ల వయసు గల రైతులు ఏఈవోలకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించింది. ఈనెల 28 వరకు పట్టాదారు పాస్‌బుక్‌ వచ్చిన రైతులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

Similar News

News October 1, 2024

MDK: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతితోపాటు మాంసాహారం, మందు షాపులు బంద్ కానున్నాయి. దీంతో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ప్రజలు పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అనే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని అంటున్నారట.

News October 1, 2024

MDK: డీఎస్సీలో సత్తా చాటిన అభ్యర్థులు

image

సోమవారం విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి మెదక్ అభ్యర్థులు సత్తా చాటారు. చిలపిచెడ్ మండలం రహీంగూడకు చెందిన జూల లింగం(SGT), అక్కన్నపేటకు చెందిన జంగం నవీన్( ఫిజికల్ సైన్స్) మెదక్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. హత్నూర మండలం కాసాలకు చెందిన పన్యాల సాయికృష్ణ SGT సాంఘిక శాస్త్రంలో జిల్లాలోనే 2వ ర్యాంక్ సాధించగా.. అక్కన్నపేటకు చెందిన శ్రీధర్ గౌడ్ అనే యువకుడు(సాంఘిక శాస్త్రం) ఆరో ర్యాంకు సాధించారు.

News October 1, 2024

సంగారెడ్డి: సెల్ ఫోన్ రిపేరింగ్ పై ఉచిత శిక్షణ

image

సెల్ ఫోన్ రిపేరింగ్ ఉచిత శిక్షణ కోసం అర్హులైన పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ సమయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ సోమవారం తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లు వయసున్న వారు అర్హులని చెప్పారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంపికైన వారికి అక్టోబర్ 14 నుంచి నెలరోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు.