News April 28, 2024
MDK: లోక్ సభ నియోజకవర్గ ఓటర్ల సంఖ్య

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 18.28 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషుల కంటే మహిళలు అధికంగా ఉన్నారు. ఈ జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 16,04,947 మంది ఓటర్లు ఉండగా, ఐదేళ్లల్లో 2.23 లక్షల మంది ఓటర్లు పెరగడం గమనార్హం.
Similar News
News July 10, 2025
MDK: ఇద్దరు మహిళలు అదృశ్యం.. కేసు నమోదు

కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు మహిళలు అదృశ్యమైన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. స్థానిక రెడ్డి కాలనీలో నివాసం ఉండే అక్కల అరుణ (27), ఆమె తోటి కోడలు అక్కల మౌనిక (26) మంగళవారం అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News July 10, 2025
మెదక్: యాప్‌లో వివరాలు నమోదు చేయాలి: డీఈవో

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయాలని డీఈవో రాధా కిషన్ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించిన పుస్తకాలు, యూనిఫామ్ వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే ప్రధానోపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు.
News July 10, 2025
మెదక్: గుణాత్మక విద్య కోసం చొరవ చూపాలి: కలెక్టర్

నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడానికి సంబంధిత ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు చొరవ తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. బుధవారం మెదక్ డైట్‌లో ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలు మెరుగుకు సంబంధిత ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో ఎఫ్ఎల్ఎన్ మానిటరింగ్ సమావేశం, ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు.