News September 19, 2024
MDK: వచ్చే నెల 3 నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో వచ్చే నెల 3 నుంచి 9 వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. అక్టోబరు 16 నుంచి 23 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఆయా విద్యాసంస్థల్లో సంప్రదించాలని ఆయన కోరారు.
Similar News
News November 10, 2024
సింగపూర్లో భరతనాట్యం.. అభినందించిన సింగపూర్ ప్రధాని
చేగుంట మండలం రుక్మాపూర్కు చెందిన బసిక ప్రశాంత్ రెడ్డి, అనితారెడ్డి దంపతుల కూతుర్లు అనీశ, ప్రనీశ భరతనాట్యంలో ప్రతిభ కనపరుస్తున్నారు. దీపావళి పురస్కరించుకొని శనివారం సింగపూర్ కమ్యూనిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన దీపావళి ఉత్సవాల్లో చిన్నకూతురు భరతనాట్యం చేసి అందరిని అబ్బరుపరిచారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ భారతీయుల సంస్కృతిక ప్రదర్శనలను అభినందించారు.
News November 9, 2024
మెదక్: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే షురూ: జిల్లా కలెక్టర్
మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణలో భాగంగా అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వే కొరకు జారీ చేసిన పుస్తకంలో మొత్తం 56 అంశాలున్నాయని ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావు లేకుండా ప్రజల నుంచి ఖచ్చితమైన సమాచారం సేకరణతో నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.
News November 9, 2024
రేగోడు: కళాశాలకు వెళ్లిన బీటెక్ విద్యార్థి అదృశ్యం
రేగోడు మండలం పట్టిపొలం తాండాకు చెందిన నేనావత్ వెంకట్(19) అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఉప్పల్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వెంకట్ దసరా సెలవులకు ఇంటికి వచ్చి గత నెల 13న రూ.10 వేలు తీసుకొని కళాశాలకు వెళ్ళాడు. దసరా నుంచి కళాశాలకు రాలేదని ప్రిన్సిపల్ 6న ఫోను చేసి సమాచారమిచ్చాడు. వెంకట్ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుండడంతో తండ్రి చందర్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.