News February 21, 2025
MDK: వన దుర్గామాతను దర్శించుకున్న సినీహీరో

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవాని మాతను ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు, నటుడు పూరీ ఆకాశ్ గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
Similar News
News February 23, 2025
మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలి: కలెక్టర్

హవేలీ ఘన్పూర్ మండలం కేంద్రం మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బాలుర పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను, సరుకుల నిల్వ రిజిస్టర్లును, అకౌంట్ రిజిస్టర్లను పరిశీలించి, ఎప్పటికప్పుడు సక్రమంగా రిజిస్టర్లను నిర్వహించాలని, ప్రతి రోజూ సమయపాలన ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
News February 22, 2025
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైలెట్ ప్రాజెక్టుగా మెదక్ జిల్లా ఎంపిక

కృత్రిమ మేధా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమంలో పైలెట్ ప్రాజెక్టుగా మెదక్ జిల్లా ఎంపికైంది. మొత్తం 6 పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన వాటిలో మెదక్తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నారాయణపేట, మేడ్చల్, భూపాలపల్లి ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలో అభ్యసనా సామర్థ్యాలు పెంపుకై పిల్లలు చదవడం, రాయడం సంబంధించి పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఈ ల్యాబ్లో కృత్రిమ మేధా సాఫ్ట్ వేర్ పొందుపరుస్తారు.
News February 22, 2025
రామాయంపేటలో చిరుత సంచారం.. ఆందోళనలో రైతులు

రామాయంపేట శివారులోని జాతీయ రహదారి సమీపంలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న 1421 సర్వే నంబర్లోని వ్యవసాయ పొలం వద్ద గత రాత్రి లేగ దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఉదయం లేగదూడను చూసిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం చేరుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు.