News July 30, 2024
MDK: ‘విజుబుల్ పోలీసింగ్‌తోనే శాంతి భద్రతలపై నమ్మకం’
హవేలిఘనపూర్ మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన పోలీసు స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. నేరాలను నియంత్రించడంతో పాటు, శాంతి భద్రతలపై ప్రజలకు నమ్మకం కలగాలంటే విజుబుల్ పోలీసింగ్‌తోనే సాధ్యపడుతుందన్నారు. పోలీసు సిబ్బంది తరచూ గ్రామాలను పర్యటిస్తూ ప్రజల్లో భద్రత భావాన్ని పెంపొందించాలన్నారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 28, 2024
MDK: జనవరి వరకు చలిపంజా.. జాగ్రత్తలు తప్పనిసరి !
ఉమ్మడి మెదక్ జిల్లాలో జనవరి వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కావున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో జలుబు, దగ్గు రావడతతోపాటు కండరాలు కుచించుకుపోయి రక్తనాళాలు గడ్డ కట్టుకుపోయి ఇతర జబ్బులు వచ్చే ఆస్కారముందన్నారు. ప్రస్తుతం చలికాలం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వేడి చేసిన నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
News November 28, 2024
సంగారెడ్డి: డిసెంబర్ 4న నాస్ పరీక్ష
సంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో డిసెంబర్ 4న నేషనల్ లెవెల్ అచీవ్మెంట్ సర్వే (నాస్) పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ నాస్ పరీక్షకు విద్యార్థులను సంసిద్ధులుగా చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
News November 27, 2024
సంగారెడ్డి: క్రిస్టియన్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
క్రిస్మస్ సందర్భంగా గౌరవ సత్కారం కోసం అర్హులైన క్రిస్టియన్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. సామాజిక, సేవారంగం, విద్యారంగం, వైద్యరంగంలో విశిష్ట సేవలు అందించిన సంస్థలు, వ్యక్తులు డిసెంబర్ 5వ తేదీ లోగా కలెక్టర్ కార్యాలయంలోని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.