News August 27, 2024
MDK: విదేశీ విద్యానిధి పథకం దరఖాస్తుల ఆహ్వానం
మెదక్: అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకంలో భాగంగా జిల్లాకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి శశికళ తెలిపారు. వార్షికోత్సవం 5లక్షల లోపు ఉండి డిగ్రీ, ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులు రావాలన్నారు. www.telanganaepass.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 14, 2024
MDK: విషాదం.. రక్త కణాలు తగ్గి చిన్నారి మృతి
మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. రక్త కణాలు తగ్గిపోవడంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన నర్సాపూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కొన్ని రోజుల నుంచి సహస్ర(7) తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు పాపను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి చనిపోయింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
News September 14, 2024
MDK: భార్య సహకారంతో అత్యాచారం.. ఆపై హత్య
భార్య సహకారంతో భర్త అత్యాచారం చేసి క్రూరంగా హింసించి హత్య చేసిన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. – VKB జిల్లాకు చెందిన భార్యాభర్తలు కురువ స్వామి, నర్సమ్మ సంగారెడ్డికి వచ్చి స్థిరపడ్డారు. కూలీ ఇప్పిస్తామని చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి మహిళలపై హత్యాచారం, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో రంగారెడ్డి కోర్టు భర్తకు 10ఏళ్లు, భార్యకు 7ఏళ్లు, ఇదే తరహా కేసులో మరో ఏడాది జైలుశిక్ష విధించింది
News September 14, 2024
MDK: సీఎం బ్రేక్‌ఫాస్ట్ ఉన్నట్టా.. లేనట్టా?
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం స్కూల్లో అల్పాహారం అందించే ఉద్దేశంతో గత ప్రభుత్వం ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పేరుతో పథకాన్ని ప్రారంభించింది. గత అక్టోబర్‌లో ప్రారంభమైన పథకం ఏప్రిల్ వరకు కొనసాగింది. మెదక్ జిల్లాలో 904 పాఠశాలల్లో అమలు చేయాల్సి ఉండగా, గతేడాది కేవలం 35 పాఠశాలల్లోనే పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. ప్రస్తుతం నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు కావస్తున్నా అల్పాహారం మాత్రం అందించడం లేదు.