News September 9, 2024
MDK: విద్యుదాఘాతంతో పారిశుధ్య కార్మికుడు మృతి
గణేశ్ మండపం వద్ద విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో పంచాయతీ స్వీపర్ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. రాజుపేట గ్రామానికి చెందిన దాసరి పోచయ్య (70) ఈరోజు ఉదయం మండపం వద్ద శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News October 5, 2024
సంగారెడ్డి: ఇన్‌స్పైర్ మనక్‌కు దరఖాస్తు చేసుకోండి !
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలో 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 15లోగా ఇన్‌స్పైర్ మనక్‌కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఇన్‌స్పైర్ మనక్‌కు దరఖాస్తు చేసుకునేలా ఉపాద్యాయులు కృషి చేయాలని కోరారు.
News October 5, 2024
వెంకట స్వామికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం
ట్యాంకు బండ్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకట్ స్వామి జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని వెంకట స్వామి విగ్రహానికి ఎమ్మేల్యేలు వివేక్, వినోద్‌తో కలిపి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాల్లో నైతిక విలువలను, ప్రజా స్వామ్య విలువలను ఏ విధంగా పరిష్కరించరించలేని అంశాలను కూడా అవలీలగా అధిగమించిన నేత వెంకట్ స్వామి అని కొనియాడారు.
News October 5, 2024
రాజగోపురంలో అన్నపూర్ణ దేవిగా ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం
దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మూడోరోజు శనివారం ఏడుపాయల వన దుర్గాభవాని మాతను నీలం రంగు వస్త్రాలతో శ్రీ అన్నపూర్ణ దేవి (చంద్రఘంటాదేవి)రూపంలో అలంకరించారు. వేకువజాము నుంచి వేద బ్రాహ్మణులు రావికోటి-శంకర్ శర్మ ఆధ్వర్యంలో రాజ గోపురంలో శ్రీ వన దుర్గభవాని అమ్మవారికి మంజీరా జలాలతో ప్రత్యేక అభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన పూజలు నిర్వహించి నీలం రంగు వస్త్రాలతో అన్నపూర్ణ దేవిగా అలంకరించి మంగళహారతి ఇచ్చారు.