News April 2, 2024

MDK: విషాదం.. కుప్పకూలి మహిళ మృతి

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట బస్టాండ్ వద్ద ఓ మహిళ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీ తాగిన అనంతరం చెట్టుకింద కూర్చున్న మహిళ ఛాతి నొప్పి వస్తుందంటూ అక్కడే కుప్పకూలి చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలు కామారెడ్డి మండలం తిమ్మానగర్‌కు చెందిన గుర్రాల కళవ్వగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 30, 2025

ఎస్పీని సన్మానించిన బాధిత కుటుంబీకులు

image

మెదక్ పట్టణంలో పెళ్లిరోజు జరిగిన బంగారం చోరీని ఛేదించిన పోలీసులను అభినందిస్తూ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావును బాధితులు సన్మానించారు. పెళ్లిరోజు పది తులాల బంగారం చోరీకి గురికాగా, సీఐ మహేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. బాధిత కుటుంబానికి కోర్టు ద్వారా బంగారు ఆభరణాలు అందజేశారు. బాధిత కుటుంబం ఎస్పీని కలిసి శాలువాతో సన్మానించింది.

మెదక్: ‘నిర్భయంగా బయటకు రండి’

image

మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తాయని మెదక్ ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు తెలిపారు. వేధింపులకు గురవుతున్నవారు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. మెదక్ డివిజన్‌లో 5 ఎఫ్‌ఐఆర్‌లు, 8 ఈ-పిట్టి కేసులు, తూప్రాన్ డివిజన్‌లో 3 ఎఫ్‌ఐఆర్‌లు, ఈ-పిట్టి కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు.