News September 6, 2024
MDK: విషాదం.. బ్యాంకు స్లిప్పే సూసైడ్ లెటర్..!
HYD మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలో ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామ <<14033756>>రైతు సురేందర్ రెడ్డి<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆత్మహత్యకు గల కారణాలను ఆయన SBI బ్యాంకుకు సంబంధించిన స్లిప్పుపై రాశాడు. ‘చిట్టాపూర్ బ్యాంకులో రుణమాఫీ కాలేదు, నా చావుకు కారణం మా అమ్మ.. చిట్టాపూర్ బ్యాంకు’ అని రాసి ఉరేసుకుని చనిపోయాడు.
Similar News
News September 10, 2024
గల్ఫ్‌లో మరో మెదక్ జిల్లా వాసి మృతి
గల్ఫ్‌లో మరో మెదక్ జిల్లా వాసి మృతి చెందాడు. హవేలీఘనపూర్ మండలం సుల్తాన్ పూర్ తండాకు చెందిన రామావత్ వస్రాం(40) మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన ఏజెంట్ ద్వారా గత నెల10న కూలి పని కోసం దుబాయ్ వెళ్ళాడు. నిన్న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కాగా మెదక్ మండలం తిమ్మక్కపల్లి తండాకు చెందిన రాట్ల సూర్య కూడా ఈనెల 1న అబుదాబిలో మరణించగా మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు.
News September 10, 2024
MDK: టాస్కులు, కమీషన్ పేరుతో భారీ మోసం
సైబర్ మోసంలో టెకీ రూ.లక్షలు పోగొట్టుకున్న ఘనట అమీన్‌పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు వివరాలు.. జన్మభూమి కాలనీ ఫేస్-2కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి టాస్కులు, కమీషన్ పేరుతో మెసేజ్ వచ్చింది. ఉద్యోగి తన వివరాలు నమోదు చేయగా టాస్కులు పూర్తి చేస్తే పెట్టిన నగదుతోపాటు కమీషన్ వస్తుందని నమ్మించారు. ఉద్యోగి పలు దఫాలుగా రూ.15.82లక్షలు వేశాడు. తాను పెట్టిన నగదుతో పాటు కమీషన్ ఇవ్వాలని అడుగగా స్పందించ లేదు.
News September 10, 2024
MDK: డెంగ్యూతో బాలుడు మృతి
డెంగ్యూతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన బాలుడు చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన ప్రభులింగం కుమరుడు దశ్విక్(45రోజులు) మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.