News September 14, 2024
MDK: విషాదం.. రక్త కణాలు తగ్గి చిన్నారి మృతి

మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. రక్త కణాలు తగ్గిపోవడంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన నర్సాపూర్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కొన్ని రోజుల నుంచి సహస్ర(7) తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు పాపను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి చనిపోయింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
Similar News
News October 14, 2025
మెదక్: NMMS దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ (NMMS) పరీక్ష దరఖాస్తుల గడువు ఈ మంగళవారంతో ముగియనుందని ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనుందని తెలిపారు. పూర్తి వివరాలకు bse.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
News October 14, 2025
చేగుంట: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు స్వాతి

చేగుంట మండల పరిధిలోని చందాయపెట్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కే. స్వాతి రాష్ట్ర స్థాయి కబడ్డీ అండర్ 14 పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ శంకర్ చారి తెలిపారు. స్వాతి ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయుడు శ్రీ కిషన్, ఉపాధ్యాయుల బృందం హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాఠశాల, విద్యార్థులు ఆమెను సత్కరించారు.
News October 14, 2025
MDK: అమరవీరులను స్మరించుకుంటూ వ్యాసరచన పోటీలు: ఎస్పీ

మెదక్ జిల్లాలోని పోలీస్ ఫ్లాగ్ డే (అక్టోబర్ 21) సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రకటించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకునే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ పోటీలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మూడు భాషల్లో నిర్వహిస్తారు. 6వ తరగతి నుంచి ఆసక్తి ఉన్న విద్యార్థులు పాల్గొనాలని ఎస్పీ సూచించారు.