News September 14, 2024

MDK: విషాదం.. రక్త కణాలు తగ్గి చిన్నారి మృతి

image

మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. రక్త కణాలు తగ్గిపోవడంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన నర్సాపూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కొన్ని రోజుల నుంచి సహస్ర(7) తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు పాపను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి చనిపోయింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

Similar News

News October 10, 2024

‘డీసీసీబీ ద్వారా రూ.2350 కోట్ల విలువైన సేవలు అందించాం’

image

ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ బ్యాంకు ద్వారా రైతులకు ఇప్పటివరకు రూ.2,350 కోట్ల సేవలు అందించడం జరిగిందని ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అన్నారు. డీసీసీబీ గజ్వేల్ శాఖ పూర్తి చేయడంతో బ్యాంకు మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సంబరాల్లో పాల్గొని కేక్ కట్ చేసి మహిళా సంఘాలకు రుణాలు అందజేశారు. ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ బ్యాంకు 400 కోట్ల టర్నోవర్ ఉండగా ప్రస్తుతం రూ.2,350 కోట్లకు చేరుకుందన్నారు.

News October 10, 2024

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో సిద్దిపేటకు నాలుగు పతకాలు

image

హనుమకొండలో రెండు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. రెండు చొప్పున వెండి, కాంస్య పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి తెలిపారు. రాఘవపూర్‌కు చెందిన గ్యార లీలా, ఆనంద్ డేకథ్లాన్, హై జంప్‌లో 2-కాంస్యం, నగేశ్ అండర్-18 జావెలిన్ త్రోలో వెండి, షాట్ పుట్‌లో వాసు వెండి పతకం సాధించారు.
-CONGRATS

News October 9, 2024

సంగారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్నికల కమిషనర్ సమీక్ష

image

పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి పాల్గొన్నారు. ఎన్నికల ఓటర్ లిస్టు ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.