News January 28, 2025

MDK: వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

image

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. వివరాలు.. గుమ్మడిదల(M)లో పాఠశాల బస్సు ఢీకొని సంతోష్ (7) అక్కడికక్కడే మృతి చెందగా.. హత్నూర(M)లో కామారెడ్డి జిల్లా వాసి నారాయణ(45)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గజ్వేల్‌లో బైక్ డివైడర్‌ను ఢీకొని మైలారానికి చెందిన స్వామి(26), సంగుపల్లికి చెందిన సదానందం(27) మృతి చెందారు. దుబ్బాకలో అప్పుల బాధతో శేర్వాణి మహేశ్(38) ఆత్మహత్య చేసుకున్నాడు. 

Similar News

News October 22, 2025

TTD: 11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు

image

AP: తిరుమల శ్రీవారి ట్రస్టులకు గత 11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.338.8 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు రూ.252.83 కోట్లు, ఎస్వీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.97.97 కోట్లు, ప్రాణదానం ట్రస్టుకు రూ.66.53 కోట్లు, గోసంరక్షణకు రూ.56.77 కోట్లు, విద్యాదానం ట్రస్టుకు రూ.33.47 కోట్లను దాతలు అందించారు. ఆన్‌లైన్‌లో రూ.579.38 కోట్లు, ఆఫ్‌లైన్‌లో రూ.339.2 కోట్లు వచ్చాయి.

News October 22, 2025

ప్రకాశం: విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకు మృతి.!

image

ప్రకాశం జిల్లా పొదిలి మండలం సలకనూతల గ్రామం సమీపంలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకొని భారీ వర్షంలో ట్రాక్టర్‌పై గ్రామానికి వెళ్తున్న తండ్రీకొడుకు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాదాల పెదకోటయ్య(60), మాదాల వెంకటేశ్వర్లు(25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News October 22, 2025

పేల సమస్యకు ఈ డివైజ్‌తో చెక్

image

వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది మహిళలకు పేల సమస్య ఉంటుంది. వాటిని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి పరిష్కారంగా వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ హెడ్ లైస్ కోంబ్. చూడటానికి ట్రిమ్మర్‌లా కనిపించే ఈ డివైజ్ పేలతో పాటు, వాటి గుడ్లనూ ఫిల్టర్‌లోకి లాగేస్తుంది. తర్వాత డివైజ్‌ను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఆన్‌లైన్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ప్రయత్నించి చూడండి.