News August 8, 2024
MDK: వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

ఉమ్మడి జిల్లాలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. న్యాల్కల్ మం.రాంతీర్థకు చెందిన సిద్ధన్న భార్య అంబిక, కుమార్తెతో కలిసి వెళ్తుండగా మరో బైక్ ఢీకొట్టడంతో భార్య స్పాట్‌లోనే చనిపోయింది. మెదక్‌కు చెందిన కానిస్టేబుల్ దుర్గపతి బైక్ అదుపుతప్పి, పాపన్నపేట(M) మహమ్మద్‌పల్లి వాసి <<13798319>>శంకర్<<>> ఆటో అదుపుతప్పి కిందపడి మృతిచెందారు. కొమురవెల్లి మం.లో శ్రీహరి కుక్కను తప్పించబోయి కిందపడి చనిపోయాడు.
Similar News
News September 18, 2025
మెదక్: రాష్ట్రస్థాయి పోటీలకు జేఎంజే విద్యార్థులు

మెదక్ జిల్లా మనోహరాబాద్ జేఎంజే విద్యార్థినీలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ అనిత తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో తమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని, వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ మహేశ్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News September 17, 2025
మెదక్: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రులు

హైదరాబాద్ అమీర్‌పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం PLAN INTERNATIONAL ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదాతలకు సర్టిఫికేట్లు అందజేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
News September 17, 2025
మెదక్: ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస రావు జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి, పట్టుదలతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సువిశాల భారతదేశంలో విలీనమై ప్రజాస్వామ్య దశలోకి ప్రవేశించిందని వివరించారు. రాచరిక పరిపాలన నుంచి ప్రజల పాలన వైపు వచ్చిన ఈ పరివర్తన ప్రజాస్వామ్య శక్తికి ప్రతీక అన్నారు.