News April 12, 2025

MDK: వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ శ్రీరామ్

image

వైద్య సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ సూచించారు. ఆయన శుక్రవారం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి జాతీయ కార్యక్రమాలైన ఎయిడ్స్, ఫైలేరియా, కుష్టు వ్యాధి, మలేరియా తదితర రోగాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

Similar News

News November 23, 2025

మెదక్: నేడు NMMS పరీక్ష

image

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్(NMMS) పరీక్ష ఆదివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందని జిల్లా విద్యాధికారులు తెలిపారు. పరీక్షకు విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ర్టానిక్‌ వస్తువులు అనుమతి లేదని, ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు.

News November 23, 2025

మెదక్‌లో JOBS.. APPLY NOW

image

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మెదక్ సఖి సెంటర్‌లో పొరుగు సులభ పద్ధతిలో దిగువ తెలిపిన ఉద్యోగాల నియామకానికి అర్హులైన మహిళ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారి హేమ భార్గవి సూచించారు. సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్ పోస్టులకు డిసెంబర్ 10లోపు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం మెదక్‌లో సమర్పించాలని తెలిపారు.

News November 23, 2025

మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారానే ప్రజావాణి: కలెక్టర్

image

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 24న హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఎన్నికల అవగాహన సదస్సులో అధికారులు పాల్గొంటున్న కారణంగా ఆయా శాఖల అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండాలని తెలిపారు.