News April 3, 2025
MDK: శిలాఫలకంపై పదవీకాలం ముగిసిన MLCల పేర్లు.. తీవ్ర విమర్శలు

పదవీకాలం ముగిసినా ఎమ్మెల్సీల పేరుతో అభివృద్ధి శిలాఫలకాలు ప్రారంభించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఎమ్మెల్యే రోహిత్ రావు రూ.14 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి శిలాఫలకంపై అధికారులు నిర్లక్ష్యంగా పదవీకాలం ముగిసిన ఎమ్మెల్సీ రగోతం రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు పెట్టడంపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 13, 2025
మెదక్: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు: కలెక్టర్

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. బుధవారం ఛాంబర్లో అధికారులతో సమీక్షించారు. అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. ప్రస్తుతం వాతావరణం కొనుగోళ్లకు అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు.
News November 12, 2025
మెదక్: ‘ఆన్లైన్లో సభ్యత్వ నమోదు చేసుకోండి’

జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సభ్యత్వ నమోదు కోసం ఆన్లైన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం టీఎన్జీవో భవన్లో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ పోర్టల్ను జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. తొలి సభ్యత్వాన్ని అందజేశారు.
News November 11, 2025
మెదక్: ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ఆదర్శనీయమని అదనపు కలెక్టర్ నగేష్ కొనియాడారు. కలెక్టరేట్లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఆజాద్ జయంతి వేడుక నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేష్, అధికారులు, సిబ్బంది ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు నగేష్ తెలిపారు.


