News September 15, 2024
MDK: సమన్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం: మంత్రి
అన్ని వర్గాలకు సమన్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నూతన టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి, సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గౌడ్, సిద్దిపేట ఇన్‌ఛార్జ్ పూజల హరికృష్ణతో కలిసి ఆయన గాంధీభవన్‌కు బయలుదేరారు.
Similar News
News October 14, 2024
సంగారెడ్డి: నేడు దామోదర్ రాజనర్సింహ పర్యటన
అందోల్ నియోజకవర్గంలోని చౌటకుర్ మండలం తాడ్దన్ పల్లిలోని యంఏస్ ఫంక్షన్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నేడు ఉ.11 గంటల నుంచి ఆలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
News October 13, 2024
పుల్కల్: సింగూరులో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి
పుల్కల్ మండలం సింగూరు నదిలో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. సింగూరు గ్రామానికి చెందిన విటల్ (42) శనివారం సాయంత్రం స్నానం కోసం సింగూరు నదిలోకి వెళ్లారు. సింగూరు దిగువ భాగాన స్నానం చేస్తుండగా నదిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News October 13, 2024
మెదక్‌లో ఈనెల15న టేబుల్ టెన్నిస్ ఎంపికలు
మెదక్ జిల్లా టేబుల్ టెన్నిస్ అసోషియేషన్ ఆద్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాస్థాయి టోర్నమెంట్ ఈనెల 15న సెలక్షన్స్ (ఎంపిక పోటీలు) గుల్షన్ క్లబ్ మెదక్లో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డా. కొక్కొండ ప్రభు తెలిపారు. జూనియర్, సీనియర్ విభాగాలలో బాల, బాలికలకు ఓపెన్ కేటగిరిలో స్త్రీ, పురుషులకు పోటీలుంటాయని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు పుట్టిన తేదీ దృవ పత్రాలతో డి.రవితేజ, అనిష్‌లను సంప్రదించాలని సూచించారు.