News August 26, 2024
MDK: సర్పంచ్ ఎన్నికలు.. వారొస్తున్నారు !

ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి చూపని యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.
Similar News
News November 29, 2025
తూప్రాన్: ఉరేసుకుని ఆటో డ్రైవర్ ఆత్మహత్య

ఉరేసుకొని ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తూప్రాన్ పట్టణంలో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన సుధీర్ సాహు తూప్రాన్లోని కింది వాడకట్టు వద్ద అద్దెకు ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడాడు. మృతుడికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తూప్రాన్ మార్చురికీ తరలించారు.
News November 29, 2025
మెదక్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

మెదక్ వెస్లీ పాఠశాలలో డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో నిర్వహించే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని డీఈవో విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించే ఎగ్జిబిట్స్ శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే విధంగా ఉండాలని సూచించారు. శాస్త్ర సాంకేతిక, రవాణా, వాతావరణ కాలుష్యం, కంప్యూటర్ రంగం వంటి వివిధ భాగాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు.
News November 28, 2025
మెదక్: తాత్కాలికంగా ప్రజావాణి వాయిదా

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం తెలిపారు. హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే ఫిర్యాదులు స్వీకరించబడునున్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


