News July 26, 2024
MDK: సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద వస్తోంది. గతేడాది ఇదే సమయంలో ప్రాజెక్టులో 21.272 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 13.899 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా 1444 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని అధికారులు అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో జూన్ నుంచి అర టీఎంసీ నీరు వచ్చినట్లు ఏఈ తెలిపారు.
Similar News
News November 23, 2025
ఎయిడ్స్ కౌన్సిలర్ కంట్రోల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా రాజేశ్వర్

తెలంగాణ ఎయిడ్స్ కౌన్సిలర్ కంట్రోల్ యూనియన్(టీఏసీసీయూ) రాష్ట్ర కార్యదర్శిగా మెదక్‌కు చెందిన కాముని రాజేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ప్రస్తుతం మెదక్ జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎయిడ్స్ కౌన్సిలర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వర్ గతంలో జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బి.రామణా రెడ్డి ఎన్నికయ్యారు.
News November 23, 2025
మెదక్: సత్యసాయి బాబాకు కలెక్టర్ నివాళులు

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా మెదక్ కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్ రాజ్ నివాళులు అర్పించారు. సత్యసాయి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి సేవలను కొనియాడారు. ఆయన చూపిన ప్రేమ, అహింస, సత్యం నేటి తరానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, సత్య సాయి సేవ సమితి మెదక్ జిల్లా అధ్యక్షుడు శిరిగా ప్రభాకర్, సాయిబాబా, శంకర్ గౌడ్, ప్రసన్న కుమారి ఉన్నారు.
News November 23, 2025
మెదక్: మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

ఫేక్ ట్రేడింగ్, ఫేక్ ఐపీఓలు, పార్ట్‌టైమ్ జాబ్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. చిన్న పొరపాట్లు కూడా పెద్ద ఆర్థిక నష్టాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆన్లైన్ ట్రేడింగ్, బ్యాంకింగ్ సేవలను వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.


