News March 10, 2025
MDK: సినిమాల్లోకి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో సినిమా రంగ ప్రవేశం చేయబోతున్నారు. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుని ‘ఏ వార్ ఆఫ్ లవ్ ‘ అనే ప్రేమ కథా చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే, ఆ మూవీకి సంబంధించి పోస్టర్ కూడా విడుదలైంది. తెలుగు, హిందీ భాషల్లో చిత్రం రూపుదిద్దుకుంటుందని తెలిపారు.
Similar News
News March 11, 2025
మెదక్: ‘నిరుద్యోగ యువతి, యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణ’

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ వారిచే ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువతీ, యువకులు వివిధ స్వయం ఉపాధి కోర్సులకు శిక్షణ ఇవ్వడానికి 12వ బ్యాచ్ ప్రారంభమవుతున్నట్లు మెదక్ జిల్లా యువజన క్రీడాధికారి దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 15 లోపు మెదక్‌లోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
News March 11, 2025
కొడుకులు పట్టించుకోవడం లేదు.. కలెక్టర్‌కు దంపతుల ఫిర్యాదు

వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కొడుకులు పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. దేశి కోడయ్య (91), శివలక్ష్మి (85) దంపతులకు సత్యనారాయణ, కాశీనాథ్ కుమారులున్నారు. ఆస్తులన్నీ తీసుకున్న కొడుకులు వృద్ధాప్యంలో పట్టించుకోవడం లేదని ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వృద్ధులకు న్యాయం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
News March 11, 2025
మెదక్: ప్రజావాణి అర్జీలకు పరిష్కారం చూపాలి: కలెక్టర్

ప్రజావాణి అర్జీలకు గుణాత్మక పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వ జిల్లా అధికారులకు సూచించారు. టైం బాండ్‌లో ప్రజా ఫిర్యాదులు, వినతులు పరిష్కరించాలన్నారు. మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావులతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు.