News March 23, 2025
MDK: సీఎం బర్త్డే విషెస్.. ఎంపీ రిప్లై

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో, రాష్ట్ర ప్రజాపాలనలో భాగస్వాములు కావడానికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ఎంపీ ట్విట్టర్ (X) ద్వారా స్పందిస్తూ.. సీఎంకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News April 1, 2025
మెదక్: పోలీసు యాక్ట్ అమలు: ఎస్పీ

మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ మాసం మొత్తం జిల్లా వ్యాప్తంగా 30, 30(ఏ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.
News March 31, 2025
UPDATE: చెరువులో దూకిన వ్యక్తి శవం లభ్యం

తూప్రాన్ పట్టణంలోని మ్యాడక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి శవం లభించినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన దాసరి యాదగిరి(40) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఉగాది సందర్భంగా మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య గొడవ పడింది. దీంతో మనస్తాపం చెందిన యాదగిరి సమీపంలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గాలింపు చేపట్టగా సోమవారం శవం లభించింది.
News March 31, 2025
మెదక్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి

మెదక్ జిల్లాలోని గడిచినా 24 గంటల్లో పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ 40.8, వెల్దుర్తి 40.7, మాసాయిపేట 40.6, కుల్చారం 40.5, కౌడిపల్లి, చేగుంట 40.4, శివ్వంపేట 40.3, పెద్ద శంకరంపేట్ 40.2, రేగోడ్, నిజాంపేట్ 40.1, అల్లాదుర్గ్ 39.8, నర్సాపూర్ 39.4, రామాయంపేట, టేక్మాల్ హవేలిఘనపూర్ 39.1 పాపాన్నపేట్ 39.0°, మనోహరాబాద్ 38.9 C, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.