News September 14, 2024
MDK: సీఎం బ్రేక్‌ఫాస్ట్ ఉన్నట్టా.. లేనట్టా?
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం స్కూల్లో అల్పాహారం అందించే ఉద్దేశంతో గత ప్రభుత్వం ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పేరుతో పథకాన్ని ప్రారంభించింది. గత అక్టోబర్‌లో ప్రారంభమైన పథకం ఏప్రిల్ వరకు కొనసాగింది. మెదక్ జిల్లాలో 904 పాఠశాలల్లో అమలు చేయాల్సి ఉండగా, గతేడాది కేవలం 35 పాఠశాలల్లోనే పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. ప్రస్తుతం నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు కావస్తున్నా అల్పాహారం మాత్రం అందించడం లేదు.
Similar News
News November 17, 2024
MDK: గ్రూప్-3 పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి
ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేశారు. MDK జిల్లాలో 5,867 మంది అభ్యర్థులు, 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లాలో 13,401 మంది అభ్యర్థులు, 37 కేంద్రాల్లో గ్రూప్-3 పరీక్షకు హాజరుకానున్నారు. సంగారెడ్డి జిల్లాలో 15,123 మంది అభ్యర్థులు 49 పరీక్ష కేంద్రాల్లో హాజరు కానున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.
News November 16, 2024
గజ్వేల్: ‘రేణుకది ఆత్మహత్య కాదు… హత్యే!’
కులాంతర వివాహం చేసుకున్న దళిత యువతి మైసని రేణుకది ఆత్మహత్య కాదని హత్య చేశారనే అనుమానం ఉందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామిలు ఆరోపించారు. రేణుక మరణ విషయం తెలుసుకున్న డీబీఎఫ్ బృందం బాధిత కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. రేణుక మృతిపై నిష్పాక్షిక విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
News November 16, 2024
BREAKING.. జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదర్శనగర్ మలుపు వద్ద కారు కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో కుత్బుల్లాపూర్‌కు చెందిన సురేశ్, నరసింహారావు స్పాట్లో మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని గానుగాపూర్ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.