News March 20, 2025

MDK: సీఎం రేవంత్, మంత్రిని కలిసి ఎస్సీ నేతలు

image

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మాదిగ, మాదిగ ఉప కులాల సంఘాల నాయకులు, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదరను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దశాబ్దాల కల నెరవేరిందని షెడ్యూల్డ్ కులాల ప్రజలకు మంత్రి దామోదర రాజనర్సింహ శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కలిసికట్టుగా ముందుకు సాగుతామని మంత్రి అన్నారు.

Similar News

News March 21, 2025

మెదక్: పంట రుణాల పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

image

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్లతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వార్షిక ప్రణాళిక ప్రకారం వివిధ రంగాల్లో రూ.5857 కోట్ల రుణాల లక్ష్యం ఉండగా రూ.3732.59 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. 25-26 నాబార్డ్ వారు సిద్ధం చేసిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించారు.

News March 20, 2025

మెదక్: రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

image

శుక్రవారం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం అయినప్పటికీ.. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

News March 20, 2025

మెదక్: పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. నేడు హవేలి ఘనపూర్‌లోని సర్దన జిల్లా పరిషత్ హైస్కూల్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సూచించారు.

error: Content is protected !!