News September 12, 2024
MDK: సెప్టెంబర్ 17.. ముఖ్య అతిథి ఈయనే..!

రాష్ట్రంలో సెప్టెంబర్ 17న’ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మెదక్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు హాజరుకానున్నట్లు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోజు ఉదయం పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగిస్తారు. ఇందు కోసం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News November 2, 2025
మెదక్: స్పెషల్ డ్రైవ్‌తో సత్ఫలితాలు: కలెక్టర్

భూభారతి దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన 10 రోజుల స్పెషల్ డ్రైవ్‌తో సత్ఫలితాలు వచ్చినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారం పై కలెక్టర్ ఆదివారం వివరించారు. 10 రోజుల్లో తహశీల్దార్‌ల పరిధిలో 183, ఆర్డీవోల పరిధిలో 661, కలెక్టర్ స్వయంగా 168 ఫైల్స్ క్లియర్ చేసి జిల్లాలో 1012 దరఖాస్తులను శాశ్వతంగా పరిష్కరించినట్లు తెలిపారు.
News November 2, 2025
మెదక్: KGBVలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

మెదక్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అకౌంటెంట్, ఏఎన్ఎన్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO రాధాకిషన్ తెలిపారు. అర్హత గల మహిళా అభ్యర్థులు ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు వివరాలకు కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
News November 2, 2025
మెదక్‌లో మూడు చారిత్రక శాసనాలు

మెదక్ పట్టణ నడిబొడ్డున మూడు చారిత్రక విలువైన శాసనాలు అందుబాటులో ఉన్నాయని ఔత్సాహిక చారిత్రక పరిశోధకుడు బుర్ర సంతోష్ తెలిపారు. గిద్దెకట్ట చెరువు ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న ఒక శాసనం మట్టిలో కలిసి పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దానిని భూమిలోంచి తీసి పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మరొక శాసనం నవాబ్‌పేటలో ఖిల్లా వెనుక నల్లరాతిపై చెక్కించినట్లు సంతోష్ పేర్కొన్నారు.


