News September 13, 2024
MDK: హత్యాయత్నం కేసులో నిందితునికి 7ఏళ్లు జైలు

హాత్యాయత్నం కేసులో నేరస్థుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష రూ.5వేల జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రాధాకృష్ణ చౌహన్ గురువారం తీర్పు ఇచ్చారు. సదాశివపేట మండలం కోనాపూర్‌కు చెందిన యాదయ్య పక్కన స్థలంలో వీరయ్య పగిలిన కల్లు సీసాలు వేసేవాడు. ఇదేంటని అడిగినందుకు యాదయ్యపై వీరయ్య కత్తితో హత్యాయత్నం చేశారు. నేరం రుజువు కావడంతో వీరయ్యకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.
Similar News
News July 11, 2025
మెదక్: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ల బడ్జెట్ విడుదల

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న గుడ్లకు బడ్జెట్ విడుదలైందని DEO రాధా కిషన్ తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. జిల్లాకు రూ.26,97,786 విడుదల చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే సంబంధించిన ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు.
News July 11, 2025
రాబోయే తరాల కోసం కృషి చేయాలి: డీఈవో

రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఈవో డాక్టర్ రాధా కిషన్ పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి నీరు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.
News July 11, 2025
MDK: ‘చదువుకోసం సైకిల్ తొక్కుతాం’

చదువు కోసం సైకిల్ తొక్కుతామని మెదక్ మండలంలోని ర్యాలమడుగు గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు అన్నారు. గ్రామానికి చెందిన సుమారు 20 మంది విద్యార్థులు తమ గ్రామానికి సుమారు 2 KM దూరంలో ఉన్న మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. వారు ప్రతిరోజూ సైకిల్ పై పాఠశాలకు వెళ్లివస్తుంటారు. ఆటోలో వెళ్లాలంటే డబ్బులు కావాలని, చదువు కోసం కష్టమైనా సైకిల్ పైనే వెళ్తామన్నారు.