News August 18, 2024

MDK: హరీశ్‌రావు నాటకాలాడుతున్నారు: కాంగ్రెస్ ఎంపీ

image

‘ఆగస్టు 15లోగా రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం.. సవాల్ విసిరిన హరీశ్‌రావు రాజీనామా చేయమంటే నాటకాలాడుతున్నారు’ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన HYD గాంధీభవన్‌లో మాట్లాడారు. గత BRS సర్కార్ రూ.లక్ష రుణాన్ని విడతల వారీగా మాఫీ చేస్తే బ్యాంకు వడ్డీలకూ సరిపోలేదని విమర్శించారు. ఇకనైనా హరీశ్ రావు నాటకాలు ఆపాలన్నారు.

Similar News

News September 8, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

News September 8, 2024

అయోధ్య రాముడికి పటాన్‌చెరు నుంచి ధనస్సు, బాణం

image

పటాన్‌చెరు నియోజకవర్గం ఎల్‌ఐజీలోని దత్త పీఠంలో అయోధ్య రాముడికి బహుకరించేందుకు 13కిలోల వెండి, కిలో బంగారంతో తయారు చేసిన ధనస్సు, బాణానికి ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాత చల్లా శ్రీనివాసశాస్త్రీ దీనిని తయారు చేయించారు. ఈ సందర్భంగా దాతను ఎంపీ అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో మరోసారి రామరాజ్య స్థాపనకోసం కృషి జరుగుతోందన్నారు.

News September 8, 2024

కాంగ్రెస్ పాలనలో 475 మంది రైతుల ఆత్మహత్య: హరీష్ రావు

image

కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు. అందరికీ రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పారని, కాని రైతులు రుణమాఫీ కాక తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోకపోవడంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.