News March 1, 2025
MDK: అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. MLC ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మెదక్ జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. జిల్లాలో మొత్తం 1,076 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 885 మెయిన్, 191 మినీ సెంటర్లు ఉన్నాయి. జిల్లాలో 52 టీచర్, 340 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో అంగన్‌వాడీల్లో సిబ్బంది కొరత తీరనుంది.
Similar News
News March 1, 2025
ఏడుపాయలలో విషాదం.. నదిలో మునిగి ఇద్దరు మృతి

మెదక్ జిల్లాలో ఏడుపాయల జాతర ముగింపు తర్వాత విషాదం నెలకొంది. పోతంశెట్టిపల్లి శివారులో 2వ బ్రిడ్జి వద్ద మంజీరా నదిలో మునిగి ఇద్దరు యువకులు చనిపోయారు. శనివారం స్నానం కోసం నలుగురు యువకులు దిగారు. వీరిలో కృష్ణ(20), షామా(21) ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు యువకులు బయటపడ్డారు. మృతదేహాలను మెదక్ ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ ఇందిరా నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు.
News March 1, 2025
మెదక్: నేటి నుంచి పోలీసు యాక్ట్ అమలు: SP

మార్చి 1 నుంచి 31 వరకు మెదక్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 28, 2025
వన దుర్గమ్మ ప్రత్యేక అలంకరణ

మెదక్ జిల్లాలో అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏడుపాయల దేవస్థానం. మహాశివరాత్రి పురస్కరించుకుని నేడు రథోత్సవం సందర్భంగా అమ్మవారిని వేకువజామున మంజీరా నీళ్లతో అభిషేకం చేసి వివిధ రకాల పువ్వులు, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమతో అర్చకులు విశేష అలంకరణ చేశారు. తథానంతరం భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.