News February 2, 2025

MDK: అండర్-19 అమ్మాయిల టీమ్‌కు మంత్రి అభినంద‌న‌లు

image

అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలుపొందిన ఇండియా అమ్మాయిల టీమ్‌కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుభాకాంక్షలు తెలిపారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (3 వికెట్లు, 44 పరుగులు) జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. టోర్నీలో త్రిష అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారని అన్నారు. ఆమె మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని మంత్రి కోరారు.

Similar News

News April 24, 2025

పాపన్నపేట: ఒంటిపై పెట్రోల్ పోసుకున్న యువకుడు మృతి

image

ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు మృతి చెందాడు. పాపన్నపేట ఏఎస్ఐ సంగన్న కథనం ప్రకారం.. కొడుపాకకు చెందిన అవుసుల శ్రీకాంత్ (24) స్వర్ణకారుడుగా పనిచేస్తున్నాడు. ఈనెల 21న రాత్రి ఇంట్లో భార్య, తల్లికి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెంది శ్రీకాంత్ పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని మృతుడి భార్య లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News April 24, 2025

చేగుంట: రోడ్డు ప్రమాదంలో RMP వైద్యురాలి మృతి

image

చేగుంట శివారులో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ వైద్యురాలు మృతి చెందినట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా గాజులరామారం వాసి కమ్మరి మంజుల(45) బుధవారం కూతురు గ్రామమైన కామారెడ్డి జిల్లా రామారెడ్డి నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళ్తుంది. చేగుంట వద్ద లారీ రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలవడంతో బైక్ ఢీకొని మంజుల అక్కడికక్కడే మృతి చెందింది.

News April 23, 2025

మెదక్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉచిత బైక్ మెకానిక్ కోసం గ్రామీణ ప్రాంతానికి చెందిన పురుషులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్బీఐ శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ మంగళవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 18 నుంచి 45 సంవత్సరాల వరకు పురుషులు అర్హులని చెప్పారు. ఆధార్, రేషన్ కార్డు, నాలుగు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో మే 8 వరకు బైపాస్ రహదారిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

error: Content is protected !!