News September 3, 2025
MDK: అత్తింటి వేధింపులతో నవ వధువు సూసైడ్

చిన్నశంకరంపేటకు చెందిన రాధిక(19)కు నెల రోజుల క్రితం ఇంటి పక్కనే ఉన్న వానరాసి కుమార్(22)తో పెళ్లి అయింది. కాగా, అత్తింటి వేధింపులు భరించలేక<<17595482>> నవ వధువు రాధిక<<>> ఊరేసుకున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు. అయితే రాధిక తండ్రి రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. తల్లి, అన్న, చెల్లెలు గత ఏడాది చనిపోయారు. ప్రస్తుతం 15 ఏళ్ల తమ్ముడు, ఇద్దరు అక్కలు ఉండగా.. ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News September 3, 2025
టేక్మాల్: గణపతి లడ్డూ దక్కించుకున్న ముస్లిం యువకుడు

టేక్మాల్‌లో గణపతి లడ్డూను ముస్లిం యువకుడు మతీన్ దక్కించుకున్నాడు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం టేక్మాల్‌లోని నాగులమ్మ ఆలయం వద్ద గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి లడ్డూకు నిర్వాహకులు వేలం పాట నిర్వహించారు. హోరాహోరీగా సాగిన వేలంలో గ్రామానికి చెందిన మతీన్ రూ. 21 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. నిర్వాహకులు అతనికి ఈ ఘటన మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచింది.
News September 3, 2025
మెదక్ జిల్లాలో 5,23,327 మంది ఓటర్లు

తుది ఓటరు జాబితా ప్రకారం మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులు ఉన్నాయి. మొత్తం 5,23,327 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 2,51,532 మంది, మహిళలు 2,71,787 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. వార్డుకు ఒకటి చొప్పున మొత్తం 4,220 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తులో అధికారులు నిమగ్నమయ్యారు.
News September 3, 2025
విద్యార్థులకు క్రీడలు, క్రమశిక్షణ అవసరం: సీఐ రేణుక

పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు క్రీడలు, క్రమశిక్షణ చాలా అవసరమని అల్లాదుర్గం సీఐ రేణుక అన్నారు. అల్లాదుర్గ మండలం ముస్లాపూర్ పాఠశాలలో ఎంఈఓ ధనుంజయ అధ్యక్షతన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడ పోటీలు ప్రారంభించారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమేనన్నారు. మానసిక వికాసం వంటివి విద్యార్థులలో అభివృద్ధి చెందుతాయని స్నేహపూరిత వాతావరణంలో క్రీడలు ఆడుకోవాలని సూచించారు.