News October 3, 2025
MDK: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ శివారులోని ఒక పౌల్ట్రీ ఫారమ్‌లో పనిచేస్తున్న ఈశ్వరి (33) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈశ్వరిని భర్త నాగార్జుననే హత్య చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చేగుంట పోలీసులు భర్త నాగార్జునను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతురాలు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందినవారు.
Similar News
News October 3, 2025
ASF: మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించే స్థానాలు ఇవే..!

ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం, మొదటి విడతలో 8 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సిర్పూర్ టీ 8, కౌటాల 9, చింతల మానేపల్లి 8, బెజ్జూర్ 8, పెంచికలపేట్ 5, దహేగాం 8, కాగజ్ నగర్ 15, రెబ్బెన 10, మండలాల్లోని 71 ఎంపీటీసీ స్థానాలకు, 8 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొన్నారు.
News October 3, 2025
‘నాసా’ ఆపరేషన్స్ నిలిపివేత.. కారణమిదే!

ప్రభుత్వ నిధుల లోపం కారణంగా తమ ఆపరేషన్స్‌ను నిలిపివేసినట్లు నాసా ప్రకటించింది. తదుపరి నోటీసు వచ్చేవరకు ఏజెన్సీని మూసివేస్తున్నట్లు వెబ్‌సైట్‌లో పేర్కొంది. అక్కడి కాంగ్రెస్ కొత్త బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం <<17882827>>షట్‌డౌన్<<>> అయిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ షట్‌డౌన్ కారణంగా ISS, స్పేస్‌క్రాఫ్ట్ వంటి క్రిటికల్ ఆపరేషన్స్ మినహా మిగతా ప్రాజెక్టులను నాసా నిలిపివేసింది.
News October 3, 2025
‘శ్వేతనాగు’ సినిమా రచయిత కన్నుమూత

ప్రముఖ రచయిత లల్లా దేవి (82) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా నిమ్మగడ్డవారిపాలెం గ్రామానికి చెందిన ఆయన అసలు పేరు పరుచూరి నారాయణాచార్యులు. ‘లల్లా దేవి’ పేరిట కథలు, నవలలు రాశారు. దివంగత నటి సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన ‘శ్వేతనాగు’ సినిమాకు కథ అందించారు. 150కి పైగా నవలలు, నాటకాలు రచించారు. వాటిలో ఆమ్రపాలి, మహామంత్రి తిమ్మరుసు వంటి నవలలు పాపులర్ అయ్యాయి.