News January 1, 2025
MDK: ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. మీ ఇంటికి వచ్చారా..?
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే శరవేగంగా కొనసాగుతోంది. ఈ నెల 31లోగా పరిశీలన చేసి, వివరాలను యాప్‌లో నమోదు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశించారు. ఏ గ్రామంలో సర్వే చేస్తారో ముందు రోజే చాటింపు చేయాలని, ఏ ఒక్క దరఖాస్తును వదిలిపెట్టొద్దు అంటూ ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. అధికారులు సర్వే కోసం మీ ఇంటికి వచ్చారా..? కామెంట్ చేయండి.
Similar News
News January 4, 2025
ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన చలి
ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో 6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మెదక్ జిల్లాలోని బోడగట్టు, మనోహరబాద్, శివంపేట, నార్సింగి, కుల్చారం, సంగారెడ్డి జిల్లా కోహిర్, న్యాల్కల్, అల్మాయిపేట్, మాల్చెల్మా, నల్లవల్లి, అల్గోల్, సత్వార్, లక్ష్మీసాగర్, సిద్దిపేట జిల్లాలో అంగడి కిష్టాపూర్, పోతారెడ్డిపేట తదితర ప్రాంతాల్లో చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
News January 4, 2025
SDPT: రోడ్డు భద్రతపై ప్రజలు చైతన్యం కావాలి: మంత్రి పొన్నం
రోడ్డు భద్రతపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాల విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతపై ఫ్లకార్డులతో అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
News January 3, 2025
కేటీఆర్‌ను కలిసిన మెదక్ జిల్లా నేతలు
హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని నందినగర్ వారి నివాసంలో నూతన సంవత్సరం సందర్భంగా మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న సస్థానిక సంస్థల ఎన్నికల పట్ల దిశా నిర్దేశం చేశారు.