News October 19, 2025
MDK: ఈనెల 23 వరకు గడువు.. 27న డ్రా

ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. శనివారం ఉదయం నుంచే అభ్యర్థులతో ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. మెదక్ జిల్లాలో(49 షాపులు) 1,350, సిద్దిపేట(93)లో 2,518, సంగారెడ్డి(101)లో 4,012 దరఖాస్తులు వచ్చాయి. కాగా షాపులకు దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్యం ఇంకా పెరగనున్నాయి. ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపుల డ్రా తీయనున్నట్లు చెప్పారు.
Similar News
News October 19, 2025
వరంగల్: నేడు భోగి.. 22 వరకు దీపావళి సందడి

ఇంటిల్లిపాదినీ అలరించే దివ్వెల పండగ రానే వచ్చింది. నేడు భోగి పండగతో ప్రారంభమయ్యే వేడుకలు ఈ నెల 21న నోములతో ముగుస్తాయి. 20న దీపావళి పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు. భోగి స్నానాలతో ప్రారంభమై కేదారీశ్వర వ్రతాలు నోములు ఎత్తుకునే వరకు వేడుకలు జోరుగా సాగుతాయి. దీపావళిని పురస్కరించుకొని పూల దుకాణాలు, నోము సామానులు, టపాసుల షాపులు సిద్ధమయ్యాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సందడి నెలకొంది.
News October 19, 2025
నితీశ్.. ఇక ఆల్ ఫార్మాట్ ప్లేయర్

తెలుగు ప్లేయర్ నితీశ్‌కుమార్ రెడ్డి ఇవాళ వన్డేల్లో అరంగేట్రం చేశారు. AUSతో తొలి వన్డేలో జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేసిన NKR ఇప్పుడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా అవతరించారు. గతేడాది NOV 22న విరాట్ కోహ్లీ నుంచి టెస్ట్ క్యాప్ అందుకోగా తాజాగా రోహిత్ శర్మ చేతులమీదుగా వన్డే క్యాప్ తీసుకున్నారు. ఇవి నితీశ్ కెరీర్‌లో మరిచిపోలేని మూమెంట్స్‌గా మిగిలిపోనున్నాయి.
News October 19, 2025
మహిళలను వేధిస్తున్న 44 మంది అరెస్ట్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్ బృందాలు వివిధ ప్రాంతాల్లో మహిళలను వేధిస్తున్న 44 మంది ఆకతాయిలను అరెస్ట్ చేశాయి. 12 మంది మహిళలు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ కొనసాగుతోందని DCP సృజన కర్ణం తెలిపారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సహకారంతో ఆరుగురు ట్రాంజెండర్స్‌తోపాటు 12 మంది సెక్స్ వర్కర్లను అరెస్టు చేశారు. CP ఆదేశాల మేరకు ప్రత్యేకమైన తనిఖీలు కొనసాగుతాయని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలపాలన్నారు.