News March 3, 2025

MDK: ఉదయం 8 గంటలకు కౌంటింగ్ షురూ

image

ఉమ్మడి MDK, ADB, KNR, NZB పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. అధికారులు కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపునకు 21 టేబుళ్లు, ఉపాధ్యాయ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు సిద్ధం చేశారు. లెక్కింపునకు 2 నుంచి 3 రోజలు పట్టే అవకాశం ఉన్నందున షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించారు. ఆ ఇద్దరు విజేతలు ఎవరో చూడాలి.

Similar News

News March 3, 2025

మెదక్: ‘ప్రజావాణికి 24 దరఖాస్తులు’

image

ప్రజావాణి కార్యక్రమానికి 24 దరఖాస్తులు వచ్చాయని అదనపు జిల్లా కలెక్టర్ నగేశ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పలు సమస్యలపై దరఖాస్తులు రాగా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. భూ సమస్యలు ఉన్నవారు తమ తమ మండల కేంద్రంలోని తహశీల్దారులకు సోమవారం అర్జీలు పెట్టుకోవాలని కలెక్టర్ కోరారు.

News March 3, 2025

కరాటే మాస్టర్ నగేష్‌కు హీరో సుమన్ అభినందనలు

image

వరల్డ్ రికార్డ్ సాధించిన కరాటే మాస్టర్ నగేష్‌కు సినీహీరో సుమన్ అభినందించారు. చెన్నైలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నిర్వహించారు. ఈ లార్జెస్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో 3 వేల మంది కరాటే మాస్టర్స్ మన దేశం నుంచి హాజరయ్యారు. తెలంగాణ నుంచి తెలంగాణ సీనియర్ కరాటే మాస్టర్ నగేష్ ప్రాతినిధ్యం వహించగా 40 మంది నగేష్ వద్ద శిక్షణ పొందుతున్న కరాటే మాస్టర్స్ పాల్గొన్నారు.

News March 3, 2025

సంగారెడ్డి: తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

image

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తెల్లాపూర్‌లోని దివినో విల్లాస్‌లో తల్లి రాధిక(52)పై కొడుకు కార్తీక్ రెడ్డి కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాధిక చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమని చెప్పారు.

error: Content is protected !!