News December 3, 2025

MDK: ఓటర్లను ప్రలోభపెట్టేవారిపై కఠిన చర్యలు: ఎస్పీ

image

గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా సాగేందుకు ప్రతి ఓటరు ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, విభేదాలకు దూరంగా ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. కొందరిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. నగదు, మద్యం పంపిణీపై కఠిన నిఘా ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేష పోస్టులు పెట్టవద్దని, యువత కేసుల్లో ఇరుక్కోకూడదని సూచించారు.

Similar News

News February 21, 2026

MDK: ఈ నెల 23 నుంచి మండల స్థాయిలో ప్రజావాణి పునఃప్రారంభం: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23 నుంచి మండల స్థాయిలో ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించబడుతుంది. అదే రోజు కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 2 నుంచి కలెక్టరేట్‌లో ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

News February 21, 2026

పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

పదవ తరగతి పరీక్షలు పకడ్బందీ ప్రణాళికతో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించే అధికారులకు శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్టోరేజ్ పాయింట్ నుంచి పరీక్ష కేంద్రానికి ప్రశ్న పత్రాలు తీసుకుపోయే సమయంలో జాగ్రత్తలు వహించి పరీక్ష కేంద్రానికి ప్రశ్న పత్రాలు తీసుకుపోయే సమయంలో జాగ్రత్త వాహించాలని సూచించారు.

News February 21, 2026

మెదక్‌లో అర్ధరాత్రి విచక్షణారహితంగా దాడి

image

మెదక్‌లోని శ్మశానవాటిక సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సజీద్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. శనివారం ఉదయం గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఈఎంటీ రామవ్వ, పైలట్ రఘు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. టౌన్ SI రుక్సానా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.