News December 14, 2025

MDK: కొడుకుపై తండ్రి గెలుపు

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ సర్పంచ్‌గా మానేగళ్ల రామకృష్ణయ్య 99 ఓట్లతో తన కొడుకు వెంకటేష్ పై ఘనవిజయం సాధించారు. రామకృష్ణయ్యకు 684 ఓట్లు పోలవగా, కుమారుడు వెంకటేష్‌కు 585 ఓట్లు పోలయ్యాయి. 99 ఓట్ల మెజార్టీతో రామకృష్ణయ్య గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

Similar News

News December 15, 2025

మిరుదొడ్డి: ఆటో డ్రైవర్ నుంచి ఉపసర్పంచ్‌గా..

image

కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే ఆటో డ్రైవర్‌గా మారిన యువకుడు నేడు ఉపసర్పంచ్‌గా ఎన్నికై ఆదర్శంగా నిలిచారు. మిరుదొడ్డి మండలం కొండాపూర్ ఉపసర్పంచ్‌గా 23 ఏళ్ల సోమగల్ల భాస్కర్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 10వ వార్డు నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన భాస్కర్ అనంతరం ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, గ్రామస్థులకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

News December 15, 2025

ప్రతి అంశంలో కానిస్టేబుళ్లు కీలకం: చిత్తూరు SP

image

ప్రజా భద్రత కోసం నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లు అహర్నిశలు పనిచేయాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. విజయవాడలో నియామక పత్రాలు స్వీకరించనున్న 196 మంది అభ్యర్థులతో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కానిస్టేబుళ్లు చేసే కృషి మీదే శాంతి భద్రతల నిర్వహణ ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి అంశంలోనూ కానిస్టేబుల్ పాత్ర కీలకమన్నారు.

News December 15, 2025

పెద్దపల్లి: వీ- హబ్ పనులు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం రంగంపల్లిలో నిర్మిస్తున్న కొత్త వీ- హబ్ భవనాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఏసీలు తదితర పెండింగ్ పనులు 3 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. కాగా, మహిళలకు పారిశ్రామిక శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ భవనం ఉపయోగపడనుంది. ఈ పర్యటనలో గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ పవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.