News September 9, 2024

MDK: క్విజ్‌లో గెలిస్తే రూ.10లక్షలు

image

RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట క్విజ్ నిర్వహిస్తోంది. ఈ పోటిలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్‌సైట్‌ ద్వారా ఈనెల17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19 నుంచి 21 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో మొత్తం 71 కళాశాలలు ఉన్నాయి. 15 వేల మందికిపైగా చదువుకుంటున్నారు. వీరంతా పాల్గొనే అవకాశం ఉంది.

Similar News

News February 17, 2026

సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఈనెల 19న మెదక్, 20న నర్సాపూర్‌లో ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో బంజారా సంఘం నాయకులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ నగేష్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ పాల్గొన్నారు. వేడుకల విజయవంతానికి పలు సూచనలు చేశారు.

News February 17, 2026

జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడల్లో మెదక్ జిల్లా అధికారి

image

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ న్యూఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ తరఫున మెదక్ జిల్లా నుంచి తూప్రాన్ ఎంపీడీవో నూతికట్టు సతీష్ జాతీయ స్థాయి క్యారమ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. పురుషులు, మహిళల విభాగాలకు చెందిన 16 మంది సభ్యుల బృందానికి ఆయన కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. జాతీయ స్థాయిలో రాణిస్తున్న సతీష్‌ను పలువురు అధికారులు అభినందించారు.

News February 17, 2026

MDK: భార్య ఛైర్‌పర్సన్.. భర్త కౌన్సిలర్!

image

రామాయంపేట మున్సిపాలిటీలో భార్య భర్తలు మున్సిపాలిటీలో అడుగు పెట్టారు. భార్య గజవాడ లావణ్య ఒకటో వార్డు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. భర్త నాగరాజు ఏడవ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొంది మున్సిపాలిటీలో రెండవసారి అడుగుపెట్టారు. భార్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఛైర్ పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భార్య ఛైర్ పర్సన్, భర్త కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు.