News October 14, 2025
MDK: గురుకులాల నిధులపై రేవంత్ మాటలు నీటి మూటలేనా? హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానెల్ ద్వారా గురుకులాలకు నిధులు విడుదల చేస్తామన్న మాటలు నీటి మూటలేనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలోని 1,024 గురుకులాలకు కేవలం రూ.60 కోట్లు కేటాయించడం సిగ్గుచేటని అన్నారు. పెండింగ్ బిల్లులు, అద్దె బకాయిలు, సిబ్బంది వేతనాలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. గురుకులాల సమస్యల పరిష్కారానికి తక్షణ నిధులు విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
Similar News
News October 14, 2025
నిజామాబాద్: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మ నాయక్ తెలిపారు. మంగళవారం గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆవరణలో మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించడం మన బాధ్యతగా గుర్తించాలన్నారు. పర్యావరణం, ప్రగతిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
News October 14, 2025
పార్వతీపురం కలెక్టర్‌కు అరుదైన గౌరవం

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డికి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)నుంచి అరుదైన గౌరవం లభించింది. ఈనెల 27,28వ తేదీల్లో ముస్సోరిలో కలెక్టర్లకు శిక్షణ కోసం NAKSHA కార్యక్రమంపై నిర్వహించే రెండు రోజుల శిక్షణ, వర్క్ షాప్‌నకు రావాలని ప్రభాకరరెడ్డిని ఆహ్వానించింది. ఈ మేరకు కలెక్టర్లకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు.
News October 14, 2025
TIDCOకు అప్పుగా ₹300 కోట్ల నిధులు

AP: టిడ్కో ఇళ్ల బిల్లుల చెల్లింపునకు ₹300 కోట్ల రుణం మంజూరుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. రాజీవ్ స్వగృహ నుంచి ₹200 కోట్లు, APUFIDC నుంచి ₹100 కోట్లు టిడ్కోకు ఇవ్వాలని ఆదేశించింది. కాగా టిడ్కో ఇళ్లకోసం హడ్కో ₹4450 కోట్లు మంజూరు చేసినప్పటికీ ప్రభుత్వం, లబ్ధిదారుల వాటా నిధుల ఆలస్యం వల్ల చాలా చోట్ల పనులు నిలిచిపోయాయి. ₹450 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నట్లు టిడ్కో ప్రభుత్వానికి తెలిపింది.