News July 25, 2024
MDK: గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

రాష్ట్రంలోని గురుకుల కళాశాలలో ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు TGSWREI సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో హత్నూర గురుకులంలో రేపు బాలికలకు, 27న బాలురకు మిగిలిన ఖాళీల్లో ఇంటర్, ఒకేషనల్ గ్రూపుల్లో భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 10వ తరగతి 2024 మార్చిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు.
Similar News
News November 11, 2025
మెదక్: సమస్యల సత్వర పరిష్కారానికి… లోక్ అదాలత్: ఎస్పీ

ఈ నెల 15న జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు కోరారు. త్వరగా, తక్కువ ఖర్చుతో, ఇరుపక్షాల సమ్మతితో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఈ లోక్ అదాలత్‌లో లభిస్తుందని ఎస్పీ తెలిపారు. క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్, ఆస్తి విభజన వంటి రాజీపడే అవకాశమున్న కేసులను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని ఆయన సూచించారు.
News November 10, 2025
మెదక్: ‘ఆరు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు’

సంచార పశువైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు 2017 సంవత్సరంలో పశు సంచార వైద్యశాలను అందించారు. ఇందులో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్, హెల్పర్లకు గత ఆరు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం వచ్చిన వెంటనే పశువులకు సేవలందిస్తున్న తమకు వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 10, 2025
ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో దీపోత్సవం

ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో కార్తీక సోమవారం పురస్కరించుకొని సాయంకాల ప్రదోషకాల వేళలో దీపాలంకరణ సేవ నిర్వహించారు. అర్చకులు పార్థీవ శర్మ ఆధ్వర్యంలో పూజల అనంతరం మంటపంలో అమ్మవారి ఆకారంలో దీపాలు వెలిగించారు. అనంతరం మంజీరాలో గంగాహారతి ఇచ్చారు. ఆకాశ దీపం వెలిగించారు. భక్తులు పాల్గొని అమ్మవారి నామస్మరణ మారుమ్రోగించారు.


