News September 23, 2025

MDK: గూగుల్ మ్యాప్ నమ్ముకొని ఇరుక్కుపోయాడు

image

మెదక్ జిల్లాలో గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రయాణించిన డీసీఎం డ్రైవర్ ఇబ్బందుల్లో పడ్డాడు. ఆదివారం వైజాగ్ నుంచి వడియారం మహావీర్ పేపర్ పరిశ్రమకు వచ్చిన డీసీఎం.. గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్లగా కుంట కట్టవైపు చూపించింది. ముందుకు వెళ్లగా రైల్వే ట్రాక్ అడ్డు రావడంతో వెనుకకు రివర్స్‌లో వస్తుండగా కట్టపై గుంతలో డీసీఎం ఊరుకుపోయింది. క్రేన్ సహాయంతో డీసీఎంను బయటకు తీశారు.

Similar News

News September 23, 2025

వయోజన పాఠశాల, బ్రాంచి పోస్టాఫీస్ ఏర్పాటు చేశారు.!

image

రంగస్థల నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు బాచు అచ్యుతరామయ్య సెప్టెంబర్ 23, 1926 గుంటూరు జిల్లాలో గాజుల్లంకలో జన్మించారు. గాజుల్లంకలో వయోజన పాఠశాల, బ్రాంచి పోస్టాఫీస్ ఏర్పాటు చేశారు. గాజుల్లంకలో 36 ఏళ్లు ఉపాధ్యాయులుగా, 40 ఏళ్లు బ్రాంచి పోస్ట్ మాస్టర్‌గా పనిచేశారు. పదవీ విరమణ సమయంలో 40మంది కళాకారులను, క్రీడా కారులను, విద్యావేత్తలను సన్మానించారు. 1958 ప్రాంతంలో విరివిగా నాటకాలలో నటించారు.

News September 23, 2025

సూర్యలంక బీచ్ ఫెస్టివల్ వాయిదా

image

AP: బాపట్లలోని సూర్యలంక తీరంలో ఈ నెల 26, 27, 28వ తేదీలలో నిర్వహించాల్సిన బీచ్ ఫెస్టివల్ వాయిదా పడింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటక శాఖ తెలిపింది. నిన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి అధికారులకు ఇదే విషయాన్ని తెలియజేశారు. త్వరలోనే కొత్త తేదీలను నిర్ణయించనున్నట్లు వెల్లడించారు.

News September 23, 2025

భీమవరం: ఇన్‌ఛార్జి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిగా సూరిబాబు

image

జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్ అధికారిగా ఏవి సూరిబాబు ఇటీవల నియమితులయ్యారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగరాణి‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. అన్ని వసతి గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించాలన్నారు.