News February 22, 2026
MDK: జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్టులు

కామారెడ్డి విద్యానికేతన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మెదక్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. రాష్ట్రం నుంచి జాతీయస్థాయికి ఎంపికైన 21 ప్రాజెక్టుల్లో నాలుగు మెదక్ జిల్లా నుంచే కావడం విశేషం. మహతి (వ్యర్థాల నిర్వహణ), అక్షయ్ (ఎమర్జింగ్ టెక్నాలజీ), గణేష్ (నీటి సంరక్షణ), ఆఫీఫా (వినోద భరిత గణితం) ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. కలెక్టర్ రాహుల్ రాజ్ అభినందించారు.
Similar News
News February 27, 2026
తూప్రాన్: విద్యుదాఘాతంతో యువరైతు మృతి

తూప్రాన్ మండలం మల్కాపూర్ వద్ద విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతు కొంతం మణికాంత్(23) గురువారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద విద్యుత్తు సరఫరాను పరిశీలిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దాంతో మణికాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు
News February 26, 2026
మెదక్: ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 98.26% హాజరు

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 కేంద్రాల్లో మొత్తం 98.26% మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. జనరల్ విభాగంలో 4850 మంది, ఒకేషనల్ విభాగంలో 527 మంది పరీక్ష రాశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, గైర్హాజరైన 95 మంది విద్యార్థుల వివరాలను వెల్లడించారు.
News February 26, 2026
మెదక్ జిల్లా పోలీస్ శాఖకు రెండు పెట్రోల్ బంకులు: ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ శాఖకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) నుంచి రెండు పెట్రోల్ బంకులు మంజూరైనట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. వీటిలో ఒకటి శంకరంపేట్(ఆర్) మండల కేంద్రంలో, మరొకటి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన(ఆవుసులపల్లి) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే శంకరంపేట్(ఆర్)లో బంకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే మిగతావి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.


