News March 26, 2026
MDK: డబ్బాలలో పెట్రోల్, డీజిల్ నిల్వ నిషేధం: ఎస్పీ

డబ్బాలు లేదా ప్లాస్టిక్ కంటైనర్లలో పెట్రోల్, డీజిల్ నిల్వ చేయడం పూర్తిగా నిషేధమని ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఇంధనాన్ని ఇళ్లలో నిల్వ చేయవద్దని సూచించారు. పెట్రోల్ బంక్ డీలర్లు నిషేధ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Similar News
News April 10, 2026
ఆధునిక సాంకేతికతను వినియోగించాలి: కలెక్టర్

ఆధునిక సాంకేతికతతో పంటల వివిధీకరణ చేపట్టి ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులకు సూచించారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని కోరారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలని, మత్స్య సంపద పెంపుపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖకు దిశానిర్దేశం చేశారు.
News April 9, 2026
మెదక్: ‘అరైవ్ అలైవ్ వీక్’ను విజయవంతం చేయాలి’

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13 నుంచి నిర్వహించనున్న ‘అరైవ్ అలైవ్ వీక్’ను విజయవంతం చేయాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామసభలు, ర్యాలీలు, వాహనదారులకు కంటి పరీక్షలు నిర్వహించి రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.
News April 9, 2026
మెదక్: దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. HYDలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఈ కోర్సు నిర్వహించబడుతుందన్నారు. 10వ తరగతి అర్హతతో 2026-27 విద్యా సంవత్సరానికి మొదటి ఏడాది డిప్లొమాలో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


