News August 16, 2025

MDK: డైట్‌లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు: ప్రిన్సిపల్

image

ప్రభుత్వ, ప్రైవేట్ డీఈడీ కళాశాలలలో భర్తీ కాకుండా మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు మెదక్ ప్రభుత్వ డైట్ ప్రిన్సిపల్ ప్రొ.డి.రాధాకిషన్ తెలిపారు. ఈనెల 19, 20 తేదీల్లో అడ్మిషన్ పొందాలన్నారు. డీసెట్-2025లో క్వాలిఫై అయిన అభ్యర్థులు డీఎల్ఈడీ, డీపీఎస్ఈ కోర్సులలో మార్గదర్శకాల ప్రకారం సంబంధిత కేటగిరిలో ఖాళీలను బట్టి ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు.

Similar News

News August 16, 2025

మెదక్: రైతులకు డీఏవో దేవ్ కుమార్ సూచనలు

image

భారీ వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ సూచించారు. పంట పొలాల్లో నీరు నిలిచి ఉంటే కాలువల ద్వారా బయటకు పంపాలని సూచించారు. నాట్లు వేయని రైతులు వర్షాలు తగ్గిన తర్వాత నాట్లు వేసుకోవడానికి సిద్ధం కావాలని కోరారు. సమయం తక్కువగా ఉంటే వెదజల్లే పద్ధతిలో విత్తనాలు వేసుకోవచ్చని సూచించారు. అలాగే, కలుపు నివారణ చర్యలు తీసుకోవాలని రైతులకు తెలిపారు.

News August 16, 2025

MDK: ఏడుపాయల వరదను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

image

ఏడుపాయల పరిసర ప్రాంతాలను మెదక్ జాయింట్ కలెక్టర్ నగేశ్ సందర్శించి వరద పరిస్థితిని పర్యవేక్షించారు. సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జాయింట్ కలెక్టర్ నగేశ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News August 16, 2025

మెదక్: అత్యధికంగా శివంపేటలో 128 మిమీ వర్షం

image

మెదక్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అత్యధికంగా శివంపేటలో 128 మిమీలు, నర్సాపూర్లో 108.8, కాగజ్ మద్దూర్‌లో 98.8, పెద్ద శంకరంపేటలో 89, బోడగట్టు ఈఎస్ఎస్ 74.5, కాళ్లకల్ 68 మిమీలు, మిగతా చోట్ల ఇంతకన్నా తక్కువ వర్షపాతం నమోదయింది.