News August 2, 2024

MDK: నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2025-26 విద్యాసంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. సెప్టెంబర్ 16లోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.navodaya.gov.in వెబ్ సైట్ చూడాలన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News September 16, 2025

మెదక్: అత్యధికంగా రేగోడ్‌లో 12.5 సెంమీల వర్షం

image

మెదక్ జిల్లాలో అత్యధికంగా రేగోడ్‌లో 12.5 సెంమీల వర్షం కురిసింది. సోమవారం రాత్రి కుండపోత మాదిరిగా వర్షం కురవడంతో మెదక్ పట్టణం చెరువును తలపించింది. కాగా జిల్లాలో పలు చోట్ల ఉదయం 8 గంటల వరకు వర్షపాత వివరాలు.. మినుపూర్ 108 మిమీ, కొల్చారంలో 102 మిమీ, మెదక్ పట్టణంలో 71 మిమీ, లింగాయిపల్లిలో 71 మిమీ, టేక్మాల్ 59.5 మిమీ వర్షం కురిసింది.

News September 16, 2025

మాసాయిపేట: అనారోగ్యంతో విద్యార్థిని మృతి

image

మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని భవాని అనారోగ్యంతో మృతి చెందింది. అనారోగ్యం కారణంగా ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడంతో ఆమె చనిపోయినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మాసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న భవాని సాఫ్ట్‌బాల్ క్రీడలో చురుకుగా ఉండేది. ఆమె మృతి పట్ల ఉపాధ్యాయులు, స్నేహితులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

News September 16, 2025

రేపటి నుంచి మహిళలకు ఆరోగ్య పరీక్షలు: కలెక్టర్

image

మహిళలకు మెరుగైన ఆరోగ్య సేవలకై స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం రేపటి నుంచి అక్టోబర్ 2వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 65 హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపులలో మహిళలకు బీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు, రక్తహీనత స్క్రీనింగ్ చేయనున్నారు.