News March 24, 2025
MDK: నేటి నుంచి డీఈఈసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ

రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌కు దరఖాస్తులను నేటి నుంచి స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిందని, మే 15వ తేదీ వరకు ఇంటర్ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 25వ తేదీన ఆన్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు.
Similar News
News March 25, 2025
ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

శివంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పలు రికార్డులను ఆయన పరిశీలించి మందుల నిర్వాహణను తనిఖీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. పలు విభాగాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
News March 25, 2025
మెదక్ పట్టణంలో ATM వద్ద మోసాలు.. జాగ్రత్త

మెదక్‌లో ఓ బ్యాంక్ ATM వద్ద ఇద్దరు వ్యక్తులు డబ్బులు డ్రా చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ATM వద్ద నిలబడి ఎవరికైతే డబ్బులు డ్రా చేయడం రాదో వారినే టార్గెట్ చేస్తూ డబ్బులు తీసి ఇస్తానని చెప్పి కార్డును మార్చేస్తున్నారు. తన దగ్గర ఉన్న మరో కార్డును వారికిచ్చి అక్కడ నుంచి వెళ్లి వేరే ప్రాంతాల్లో డబ్బులు డ్రా చేస్తున్నట్లు టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఈ కొత్త తరహా మోసాలతో జాగ్రత్తంగా ఉండాలన్నారు.
News March 25, 2025
సంగారెడ్డి జిల్లాలో మహిళపై అత్యాచారం

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కంది మండలం మామిడిపల్లి పరిధిలో మంగళవారం తెల్లవారుజామున మహిళ(30)పై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన ఆమె భర్త పైనా నిందితులు దాడి చేశారు. భర్తతో కలిసి ఆటోలో వెళ్తుండగా దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.