News April 9, 2025
MDK: నేటి నుంచి పరీక్షలు

నేటి నుంచి 17 వరకు సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ తెలిపారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈ నెల 9 నుంచి, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈనెల 11 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. పరీక్షలు ఉదయం గం.9 నుంచి మధ్యాహ్నం గం.12 వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
Similar News
News April 18, 2025
భూభారతి చట్టం రైతుల పాలిట వరం: రాహుల్ రాజ్

భూ భారతి చట్టం రైతుల పాలిట వరమని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. తూప్రాన్‌లో నిర్వహించిన భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం 2025 అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుభూభారతి నూతన చట్టంపై రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు కళా ప్రదర్శనలు నిర్వహించారు. ఆర్డీవో జయ చంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
News April 17, 2025
మెదక్: ఈ నెల 20 నుంచి ఓపెన్ పరీక్షలు: డీఈఓ

ఈ నెల 20 నుంచి మే 26వ తేదీ వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. బుధవారం పరీక్షల కోసం సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. పది పరీక్షలకు 459 మంది, ఇంటర్‌కు 876 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
News April 17, 2025
మెదక్ జిల్లాలో భూ భారతిపై అవగాహన సదస్సు

మెదక్ జిల్లాలో భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. గురువారం మనోహారాబాద్, తుప్రాన్, 18న అల్లాదుర్గ్,రామాయంపేట, 19న శివంపేట,నర్సాపూర్, 20న కూల్చారాం, కౌడిపల్లి, 21న చిలిపిచేడ్, పాపన్నపేట,టేక్మాల్, 22న పెద్దశంకరంపేట్, రేగోడ్, 23న మసాయిపేట్, చేగుంట, చిన్నశంకరంపేట్, 24న ఎల్డుర్తి, నిజాంపేట్, 25న నార్సింగి, మెదక్, హవేళి ఘనపూర్ మండలాలున్నాయి.